మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 6 నవంబరు 2017 (18:48 IST)

జగన్ పాదయాత్ర మొదటిరోజే అపశృతి... గుండెపోటుతో కార్యకర్త మృతి

ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైన మొదటిరోజే అపశృతి చోటుచేసుకుంది. జగన్ మోహన్ రెడ్డితో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం నెలకొంది.

సీకే దిన్నెకు చెందిన వెంకటరమణ అనే కార్యకర్త జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఐతే కొంతదూరం పాదయాత్ర సాగగానే వెంకటరమణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి స్వస్థత చేకూర్చేలోపే గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి వెంకటరమణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.