1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 01-04-2026 Your Daily Horoscope

01-04-2026 బుధవారం ఫలితాలు - ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు

01-04-2026
01-04-2026
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవచ్చు. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. ఖర్చులు విపరీతం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. అప్రమత్తంగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం తగదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతం.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పనులు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కీలక చిత్రాలు అందుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. యత్నాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆర్థికంగా ఆకించిన విరిరాలున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. కార్యక్రమాలకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులను తేలికగా తీసుకోవద్దు. చర్చల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రయాణం చేపడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. అతిగా ఆలోచించవద్దు. ఖర్చులు సామాన్యం, సకాలంలో చెల్లింపులు జరుపుతారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ విముక్తులవుతాయి. ఖర్చులు సామాన్యం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒకపట్టాన ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నేడు అనుకూలదాయకం. ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఉత్సాహంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. 
About Writer
రామన్
తర్వాతి కథనం
ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీకి ఎంపికైన పూజ్యశ్రీ శివకృపానంద్ స్వామిజీ