సంబంధిత వార్తలు
31-03-2026 మంగళవారం ఫలితాలు - తప్పులు దొర్లే ఆస్కారం ఉంది..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. చెల్లింపులో జాప్యం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏకాగ్రతతో శ్రమించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. అప్రియమైన వార్త వింటారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. సన్నిహితుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు నెరవేరుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పాతమిత్రులు తారసపడతారు. ఆహ్వానం అందుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. యత్నాలకు అదృష్టం కలిసివస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త పరిచయాలేర్పడతాయి. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం చెల్లింపుల్లో జాగ్రత్త, ముఖ్యుల కలయిక వీలుపడదు. పసులు హడావుడిగా సాగుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆటలతో కాలక్షేపం చేస్తారు. పనులు. సకాలంలో పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలకు పట్టించుకోవద్దు. పాతమిత్రులు తారసపడతారు. విందులు, వేడుకలకు హాజరవుతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమనస్కంగా గడుపుతారు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు తగ్గించుకుంటారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ప్రయాణంలో అవస్థలు తప్పవు
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంతమాత్రమే మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఖర్చులు అధికం, ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. పొగిడేవారి ఆంతర్యం గ్రహించండి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
