మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ ఒత్తిడి తగ్గుతుంది. ఖర్చులు సామాన్యం. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఊహించని సంఘటన ఎదురవుతుంది. అపరిచితులతో జాగ్రత్త. ఎదుటివారి తీరును గమనించి మెలగండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఖర్చులు అధికం. పనులు చురుకుగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. వేడుకకు హజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. మానసికంగా స్థిమితపడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణసమస్యతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల్లో ఒత్తిడ అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అయిన వారికి సాయం అందిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. రుణ సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడండి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. చిన్న విషయానికే చికాకుపడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. నోటీసులు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.