ఆదివారం, 12 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-10-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్తపరిచయాలేర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. బంధువులతో కాలక్షేపం చేస్తారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు అధికం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రుణసమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వేడుకకు హాజరవుతారు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకివ్వవవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పత్రాలు అందుకుంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. శ్రమాధిక్యత, అకాల భోజనం. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదాపడతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలున్నాయి. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఓర్పుతో శ్రమించండి. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పనులు ఒక పట్టాన సాగవు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ధనసమస్య ఎదురవుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహదృక్పథంతో మెలగండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యులను కలుసుకుంటారు. అవకాశాలను వదులుకోవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారదక్షతతో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నోటీసులు అందుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్తసభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. పనులు సాగవు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు.