శుక్రవారం, 10 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-10-2025 మంగళవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. మితంగా సంభాషించండి. పరిచయస్తులు వ్యాఖ్యలనను వక్రీకరిస్తారు. శ్రమించినా ఫలితం ఉండదు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు అధికం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. విమర్శించిన వారే మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆహ్వానం అందుకుంటారు. ప్రయాణం తలపెడతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన ధనం అందుకుంటారు. రుణఒత్తిడి తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వివాహయత్నాలు ప్రారంభిస్తారు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. సన్నిహితులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఖర్చులు అధికం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆత్మీయుల రాకతో కుదుటపడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధనలాభం ఉంది. పనులు సానుకూలమవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. పత్రాలు అందుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యం నెరవేరుతుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.