మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బెట్టింగులకు పాల్పడవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు విపరీతం పనులు ముందుకు సాగవు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వేడుకకు హాజరు కాలేరు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు అప్పగించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు,
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మొండిధైర్యంతో వ్యవహరిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రతికూలతలను అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త యత్నాలు మొదలు పెడతారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమించినా ఫలితం ఉండదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. పరిచయస్తులతో స్పర్ధలు తలెత్తుతాయి. సామరస్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పత్రాలు అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. మీ అలవాట్లను మానుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ రోజు సంతోషదాయకం. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రావలసిన ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. దైవకార్యంల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. గృహమార్పు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ప్రశాంతంగా సాగుతాయి. మనోధైర్యంతో అడుగులేస్తారు. మీ నిర్ణయం సత్ఫలితమిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సన్నిహితుల సలహా పాటించండి. కీలక పత్రాలు అందుకుంటారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు.