గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-06-2022 శనివారం రాశిఫలాలు ... విష్ణు సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

Weekly Astrology
మేషం :- రుణాలు తీర్చడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపిస్తారు. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. దూర ప్రయాణాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
వృషభం :- సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఉమ్మడి వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహనం నడుపునపుడు మెలకువ వహించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
 
మిథునం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోనివారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. శారీరకశ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
కర్కాటకం :- ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం వాయిదా పడటం మంచిది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. బంధువుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలే జరుగుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్లమానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
సింహం :- ధనసహాయం, హామీల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు ముచ్చటిస్తారు.
 
కన్య :- విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. శతృవులపై విజయం సాధిస్తారు. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి.
 
తుల :- బ్యాంక్ వ్యవహారాల్లో మెళుకువ అసవరం. క్రీడలపట్ల నూతన ఉత్సాహం కానవస్తుంది. ఖర్చులు పెద్దగా లేకున్నా ధనవ్యయం, ధనసహాయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏజెంట్లకు, రిప్రజెంటేటికు ఒత్తిడి పెరుగుతుంది. మీ కళత్రమొండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. 
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమం. వైద్యులకు శస్త్ర చికిత్సలు నిర్వహించునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు :- ప్రభుత్వకార్యాలయాల్లో మీ పనులు ఆశించినంత చురుకుగా సాగవు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో సంతృప్తినిస్తుంది. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి.
 
మకరం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. స్లిరాస్థి క్రవిక్రయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకులు కలిగిస్తుంది.
 
కుంభం :- కవి, పండితులకు, కళాకారులకు సంఘంలో ఆదరణ లభిస్తుంది. అపరిచిత వ్యక్తులు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు ఆస్కాం ఉంది జాగ్రత్త వహించండి వ్యాపారాభివృద్ధికై చేయుప్రయత్నాలలో సత్పలితాలు పొందుతారు. మీ లక్ష్యసాధనకు బాగా కష్టపడాలి. స్త్రీలు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
మీనం :- ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికై చేయుప్రయత్నాలలో సత్ఫలితాలు పొందుతారు. మీ లక్ష్యసాధనకు బాగా కష్టపడాలి. ప్రతి వ్యవహారంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.