గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

23-06-2022 గురువారం రాశిఫలాలు ... సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం...

మేషం :- ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద పూర్తి చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనవ్యయం, శ్రమాధిక్యతతో వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
వృషభం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. మీ హోదా చాటు కోవటానికి ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- అధికారులతో మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్నపాటి ఆనారోగ్యానికిగురై చికిత్స తీసుకోవల్సివస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రతలోపం వల్ల అధికారులతో మాటపడక తప్పదు. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు.
 
సింహం :- ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. ప్రతి చిన్న చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
కన్య :- ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుటవలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధువర్గాల నుండి మాటపడవలసి వస్తుంది.
 
తుల :- ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. బంధు మిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తప్పవు. దూకుడుగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవం పొందుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాలకు కావలసిన లైసెన్సులు మంజూరవుతాయి.
 
ధనస్సు :- స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి కర్తవ్య నిర్వహణలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ సంతానం ఉన్నతి కోసం బాగా శ్రమిస్తారు.
 
మకరం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ధనం చేతిలో నిలబడటం కష్టమే. పది మంది సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం తప్పవు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ధనం చేతిలో నిలబడటం కష్టమే. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
 
మీనం :- మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరించి అందరినీ మెప్పిస్తారు. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి.