ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (23:44 IST)

జనవరి 2023 మాస గోచార ఫలితాలు

Astrology
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం శుభదాయకం. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆత్మీయులకు కానుకలు అందజేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అధికం. విలాసాలకు వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. దైవదర్శనాలు మనో ఉల్లాసం కలిగిస్తాయి. గృహమార్పు ఫలితం కనిపిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వస్త్రవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కళ, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. యత్నాలకు పెద్దల ప్రోత్సాహం ఉంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సందేశాలు, ప్రకటనల పట్ల జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవవర్శనాల్లో ఒకింత అవస్థలు తప్పవు. 
 
మిధునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. అన్యమస్కంగా గడుపుతారు. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారజయం. వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు. కళాత్మక పోటీల్లో స్త్రీలు రాణిస్తారు. 
 
సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ఆశాజనకం. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గుట్టుగా మెలగండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నగదు, పత్రాలు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు, అనుభవం గడిస్తారు. వేడుకలు, వినోదాలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కానుకలు, పురస్కారాలు అందుకుంటారు. ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం కొంతమందికి ఆపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. కీలక పత్రాలు, అందుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. పెట్టుబడులకు తరుణం కాదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులను వేడుకలకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. గుట్టుగా మెలగండి. వ్యాపారాల్లో లాభాటు గడిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం శుభయోగం. వస్త్రప్రాప్తి, సంతానసౌఖ్యం ఉన్నాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలలకొంటాయి. సమర్ధతకు గుర్తింపు, ఆకస్మిక పదవీయోగం. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు, ప్రశంసలు అందుకుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
ధనురాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. సన్నిమితుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు తగదు. భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు పనులు లభిస్తాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. కృషి, పట్టుదలతోనే విజయం సాధిస్తారు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకలకు హాజరవుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గృహమార్పు అనివార్యం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. చిన్న వ్యాపారులకు సామాన్యం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ శుభదాయకమే. ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం కళకళలాడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు విపరీతం. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ప్రముఖులకు కానుకలు, శుభాకాంక్షలు అందజేస్తారు. పరిచయాలు, వ్యావకాలు విస్తరిస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.