శుక్రవారం, 14 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 నవంబరు 2025 (22:30 IST)

Kurnool: కర్నూలు బస్సు ప్రమాదం వీడిన మిస్టరీ.. వెలుగులోకి షాకింగ్ వీడియో

Kurnool Bus Accident
Kurnool Bus Accident
కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ద్వారా కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి మిస్టరీ వీడినట్లైంది. మోటారు సైకిల్‌‌ను ఢీకొనడంతోనే కర్నూలు ఘోర ప్రమాదం జరిగిందని తొలుత అందరూ భావించారు. 
 
కానీ ఈ కేసుపై జరిగిన విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి ముందు.. శివ యాక్సిడెంట్‌కి సంబంధించిన దృశ్యాలు మరో బస్సు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బైక్ ప్రమాదం జరిగిన తర్వాత.. శివ మృతదేహాన్ని రోడ్డు పక్కకు లాగి, బాడీ పక్కనే నిల్చుని వున్న అతని స్నేహితుడు ఎర్రస్వామిని బస్సు డ్రైవర్లు ఎవరూ పట్టించుకోలేదు. 
Bike
Bike
 
ఈ ఘటనను కళ్లారా చూస్తూ బండిని నడుపుకుంటూ.. పక్కకు వెళ్లిపోయారు. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అదే మార్గంలో వెళ్లిన కొన్ని వాహనాలు కూడా ప్రమాదం జరిగిన విషయాన్ని పట్టించుకోలేదు. ఒకవైపు శివ డెడ్‌బాడీ, మరోవైపు రోడ్డు మధ్యలో బైక్ పడి ఉన్నప్పటికీ.. చూసీ చూడనట్టుగా ఇతర వాహనాలు వెళ్లిపోయాయి. ఆ బస్సులు ఆగి ఎర్రిస్వామికి సాయం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.