గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (23:42 IST)

16-10-2022 నుంచి 22-10-2022 వరకు మీ వార రాశిఫలాలు (video)

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. ఎవరినీ నిందించవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. బుధ, గురువారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మతంగా వ్యయం చేయండి. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహిస్తారు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత సంతృప్తినీయవు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం. వృత్తుల వారికి సామాన్యం. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
అన్ని రంగాల వారికీ ఆశాజనకం. సంకల్పం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆర్థకలావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మొత్తం ధనం లభిస్తుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సానుకూలమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఆది, సోమవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యులతో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం. మంగళ, బుధవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరీసోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు ఆశాజనకం. కోర్లు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదములు 
రుణ బాధలు తొలగుతాయి. తాకట్లు విడిపించుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఖర్చులు సామాన్యం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులు కలిసివస్తాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అసాంఘిక కార్యకాపాల జోలికి పోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఆది, శనివారాల్లో పనుల్లో శ్రమ, చికాకులు అధికం. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో మెలకువ వహించండి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికుల ఆదాయం బాగుంటుంది.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
మనోధైర్యమే శ్రీరామరక్ష. యత్నాలకు ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. అతిగా ఆలోచింపవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి దంపతుల మధ్య దాపరికం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంద్రింపులు జరుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ఈ వారం ప్రతికూలతలు అధికం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం విదేశీ విద్యాయత్నాం ఫలించదు. అవివాహితులు నిస్తేజానికి గురవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కనింపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. ద్విచక్ర వాహనదారులకు దూకుడు తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరం. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సోమ, మంగళవారాల్లో ఓపికతో శ్రమించిన గాని పనులు కావు. ఆదాయం సంతృప్తికరం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. జాతక పొంతన ప్రధానం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలనిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆర్థికస్థితి సంతృప్తికరం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. బుధ, గురువారాల్లో పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. విమర్శలెదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు సామాన్యం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆత్మస్థైర్యంతో శ్రమించండి. మీ సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే కొనియాడుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆత్మీయుల కలయిక ఉత్సాహపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వూల్లో ఏకాగ్రత ప్రధానం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. బాధ్యతగా వ్యవహరించాలి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆది. మంగళవారాల్లో ఆచితూచి అడుగేయాలి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.