గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (20:35 IST)

02-10-2022 నుంచి 08-10-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

Weekly Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్తేజపరుస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నిరుద్యోగులకు నిరాశాజనకం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవదర్శనాల్లో ఒకింత అవస్థలు తప్పవు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఈ వారం అనుకూలదాయకం. వాగ్దాటితో నెట్టుకొస్తారు. పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సందేశాలు, ప్రకటనలు నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఒక జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు కష్టసమయం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
వ్యవహారానుకూలత ఉంది. మీదైన రంగంలో రాణిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఓర్పుతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప పురోభివృద్ధి సాధిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
సంప్రదింపులు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. బంధువుల వైఖరిలో మార్పువస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సోమ, మంగళ వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. దైవదీక్షలు స్వీకరిస్తారు. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానం అందుకుంటారు. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. వేడుకు హాజరవుతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. మనోధైర్యంతో మెలగండి. త్వరలో శుభవార్తలు వింటారు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆది, సోమ వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపార్టులకు ఆశాజనకం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. బుధవారం నాడు కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. సంప్రతింపులతో తీరిక ఉండదు. ఎదటివారి ఆంతర్యం అవగతమవుతుంది. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ఆది, గురు వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసనారికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఓర్పుతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సోమ, మంగళ వారాల్లో నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. వాస్తుదోష నివారణ చర్యలు సత్పలితమిస్తాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి నిరాశాజనకం. దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో చికాకులు కలిగించే సంఘటనలెదురవుతాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. మనస్సును అదుపులో ఉంచుకోండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదివారం నాడు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది.
 దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.
 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ద్వితీయార్ధం నిరాశాజనకం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. శుక్ర, శని వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.