బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (20:36 IST)

09-10-2022 నుంచి 15-10-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. నోటీసులు అందుకుంటారు. సోమ, మంగళ వారాల్లో చికాకుపరిచే సంఘటనలెదురవుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వాహనదారులకు అత్యుత్సాహం తగదు.
 
మిథునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
వాగ్దాటితో నెట్టుకొస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆది, మంగళ వారాల్లో ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులండవు. ఆధ్మాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. శుక్ర వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఈ వారం కలిసివచ్చే సమయం. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యవహారదక్షతతో రాణిస్తారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో మీ
జోక్యం అనివార్యం. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. అవివాహితులకు శుభయోగం. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఆర్థిక లావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులకు అనుకూలం కాదు. పెద్దల సలహా పాటించండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. షాపుల
 స్థలమార్పు కలిసివస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు కొత్త చికాకులెదురవుతారు. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు సామాన్యం. శనివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఆప్తుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆధ్మాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
ఆర్థికస్థితి సామాన్యం. ఆకస్మిక ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. మనోధైర్యంతో మెలగండి. త్వరలో శుభవార్తలు వింటారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ఆది, సోమ వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
మీదైన రంగంలో స్థిరపడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యవహారానుకూలత ఉంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మంగళ, బుధ వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక, యోగాలపై ఆసక్తి పెంపొందుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అవివాహితులు శుభవార్తలు వింటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ప్రైవేట్ సంస్థల ఉద్మోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. మార్కెట్ రంగాల వారికి టార్గెట్లు అధికమవుతాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
సంప్రదింపులు ఫలిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. శుక్ర, శని వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నషాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
పరిస్థితులు అనుకూలిస్తాయి. సమయస్పూర్తితో వ్యవహరిస్తారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆది, బుధ వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. శుభకార్యం నిశ్చయమయ్యే సూచనలున్నాయి. ఆధ్మాతిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. పత్రాల రెన్యువల్ లో ఏకాగ్రత వహించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
సంకల్పం సిద్ధిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతముల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.