శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2025 (19:49 IST)

01-02-2025 నుంచి 28-02-2025 వరకు మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. కొత్త పనులు చేపడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. పెట్టుబడులకు అనుకూల సమయం. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాల స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. సంతానం దూకుడుతనం వివాదాస్పదమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. అకౌంటెంట్లు, రిప్రజెంటేటివ్‌ల ఒత్తిడి, పనిభారం. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చుచేస్తారు. చేపట్టిన పనులు నిరాటంకంగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అవగాహాన లేని విషయాలకు దూరంగా ఉండండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు పూర్తికావస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. వేడుకకు హాజరవుతారు. వస్త్రప్రాప్తి, వాహన సౌఖ్యం పొందుతారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. మనోధైర్యంతో మెలగండి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. రావలసిన ధనాన్ని సామరస్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ఆత్మీయులను తరుచుగా కలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రయాణం నిరుత్సాహపరుస్తుంది. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం బాగుంటుంది. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలెదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. పన్నుల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒక సమాచారం మీపై తీవ్రప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సకాలంలో రుణవాయిదాలు చెల్లించండి. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. దూరపు బంధువులతో తరచు సంభాషిస్తుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉపాధ్యాయులకు పనిభారం, విద్యార్థులకు ఏకాగ్రత లోపం. కొత్త వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఇంట ప్రశాంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పొదుపు ఆలోచన ఫలించదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు, వాహనం జాగ్రత్త. ప్రియతములు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా కొట్టిపారేయొద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల్లో విశేష ఫలితాలున్నాయి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. శుభకార్యం తలపెడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలకు తావివ్వవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టిపెడతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్యీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం కలిసివచ్చే సమయం. మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశాలు లభిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగండి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. అయిన వారితో చర్చలు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను తట్టుకుంటారు. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. పంతాలు, భేషజాలకు పోవద్దు. వాస్తవ దృక్పథంతో ఆలోచించండి. అనాలోచిత నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సంతానం చదువులపై దృష్టిసారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఈ సమస్యలు తాత్కాలికమే. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా కొత్త యత్నాలు మొదలెడతారు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా చివరి క్షణంలో పూర్తి కాగలవు. నిరుద్యోగులు, అవివాహితులకు శుభం జరుగుతుంది. వ్యాపారాల్లో కొంతమేరకు లాభాలు గడిస్తారు. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. ప్రయాణం తలపెడతారు.
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పన్ను చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతులు అవగాహనకు రాగల్గుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచికే. త్వరలో మరింత మంచి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధపెట్టండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు యూనియన్లో ఉన్నత పదవులు లభిస్తాయి.