మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (13:36 IST)

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం యోగదాయకం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త పనులు, యత్నాలకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ప్రకటనలు, ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి శుభయోగం. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అవగాహన లోపం. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారులకు కొత్త సమస్యలు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 

మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రథమార్ధం ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగు వేయండి. తొందరపాటు చర్యలు తగవు. ఆప్తుల సలహా తీసుకోండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ద్వితీయార్ధం ఆశాజనకం. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. విందులు వేడుకల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. ఇంటా బయటా ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలడతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పొదుపునకు అవకాశం లేదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహకలిగిస్తుంది. కొందరి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతాం. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. ఆదాయం బాగుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. పత్రాల్లో మార్పుచేర్పులు అనివార్యం. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంతగా ఉండాలి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
అనుకూలతలు నెలకొంటాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు పనిభారం. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆహ్వానం పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పాతపరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విందుల్లో పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ శ్రమ వృధా కాదు. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుతుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆప్తులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సంకల్పబలమే కార్యసిద్ధికి తోడ్పడుతుంది. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లు, అసహనానికి గురికావద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఓర్పుతో ఉద్యోగ యత్నాలు సాగించండి. ఉద్యోగస్తులు అధికారుల ప్రసన్నం చేసుకుంటారు. వస్త్ర, ఫ్యాన్నీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. కొత్త పనులు చేపడతారు. అధికమవుతాయి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులకు తగిన సమయం. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. అవివాహితులు శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణంలో అపరిచితులతో మితంగా సంభాషించండి.