శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (00:25 IST)

11-07-2021 నుంచి 17-07-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
కార్యసాధనకు తీవ్రంగా శ్రమిస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ప్రణాళికలు వేసుకుంటారు. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆది, గురువారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు గోప్యంగా వుంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. ఆత్మీయుల రాక ఉల్లాసాన్నిస్తుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యాసంస్థలకు ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వాగ్ధాటితో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో వుండవు. ధనసమస్యలెదురవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కంప్యూటర్ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. పిల్లలకు వాహనం ఇవ్వవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతి విషయంలో ధైర్యంగా వుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బుధవారం నాడు పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరం. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు మెరుగుపడతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు లోటుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుంటారు. గురు శుక్రవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా వుంచండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కష్టించినా ఫలితం వుండదు. నిస్తేజానికి లోనవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. రుణ సమస్యలు వేధిస్తాయి. శనివారం నాడు ఏ పనీ సాగదు. ప్రశాంతంగా వుండేందుకు ప్రయత్నించండి. ఆత్ముయుల కలయికతో కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం జాగ్రత్త. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయజాలవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్యాన్ని నిరాడంబరంగా చేస్తారు. ఆప్తులు రాకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక కోసం పడిగాపులు తప్పవు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పదవులు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలసివస్తాయి. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళ, బుధవారాల్లో పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. మీ సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ముఖ్యం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.  
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ధైర్యంగా వ్యవహరిస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. గురువారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. మనస్సు చికాకుగా ఉంటుంది. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా వుండటానికి ప్రయత్నించండి. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం సమయానికి అందదు. సాయం అర్థించేందుకు మనస్కరించదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అకారంణంగా మాటపడవలసి వుంటుంది. శుక్ర శనివారాల్లో అప్రమత్తంగా వుండాలి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఏమంత ఫలతమీయవు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన చోదకులకు తగదు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. అవకాశాలు చేజారిపోతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆత్మీయుల హితవు మీపై సత్ర్ఫభావం చూపుతుంది. ఆదివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. సంతానం మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యా సంస్థలకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక వుండదు. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చీటికిమాటికి అసహనం వ్యక్తం చేస్తారు. సోదరుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ప్రతిభకు ఏమంత గుర్తింపు వుండదు. ఖర్చులు విపరీతం. పొదుపుధనం ముందుగానే గ్రహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి.  అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఈ వారం అనుకూలదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు అదుపులో వుండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులు మోసగించే ఆస్కారం వుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలతో తీరిక వుండదు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు శుభయోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.