మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (20:24 IST)

27-06-2021 నుంచి 03-07-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
వ్యవహారాలతో తీరిక ఉండదు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తగవు. స్థిమితంగా ఆలోచిస్తే పరిష్కారం గోచరిస్తుంది. ఆప్తుల సలహా పాటించండి. బుధవారం నాడు ఆచితూచి వ్యవహరించాలి. ఆంతరంగిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వేడుకకు హాజరు కాలేరు. బంధుమిత్రుల వ్యాఖ్యలు బాధిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టకాలం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. రుణ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. గురు, శుక్రవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడింవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఓర్పు శ్రమించిన గాని పనులు పూర్తి కావు. గృహమార్పు కలిసివస్తుంది. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం వుండదు. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆది, శనివారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనలో మార్పు వస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. పాత పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానంపై చదవులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వైద్య సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ మాటే నెగ్గాలన్న పట్టుదలకు పోవద్దు. వ్యవహారాలు బెడసికొట్టే ఆస్కారం వుంది. లౌక్యంగా సమస్యలు పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. సోమ, మంగళవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. అభియోగాలు విమర్శలు ఎదుర్కొంటారు. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఊహించని ఖర్చులు అధికం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. వ్యవహారాల్లో తప్పటుడుగు వేసే ఆస్కారం వుంది. పెద్దల సలహా పాటించండి. బుధ, గురువారాల్లో అభియోగాలు, విమర్శలు ఎదురవుతాయి. పట్టుదలతో శ్రమించినా గాని పనులు పూర్తి కావు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి మీ శ్రీమతి విషయంలో  దాపరికం తగదు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. నిజాయితీగా మెలగి ప్రశంసలందుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. శుక్ర, శనివారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పనలు ప్రారంభంలో చికాకులెదుర్కుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. అధికారులకు ఒత్తిడి, పనిభారం వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. బెట్టింగ్‌‌‌లు, పందాల జోలికిపోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పొదుపు మూలక ధనం అందుకుంటారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు హోదామార్పు, విదేశీయాన యత్నాలను విరమించుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రతికూలతలు తొలగిపోతాయి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. మంగళ, బుధవారాల్లో ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆప్తుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు అనుకూలం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకాలం చుడతారు. ఉపాధి అవకాశాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అర్చకులు, ఆలయ సిబ్బందికి కొత్త సమస్యలెదురవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ వారం నిరాశాజనకం. అవకాశాలు చేజారిపోతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పెద్దల సలహా పాటిస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పరిస్థితులు క్రమంగా చక్కబడుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం వుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సామాజిక కార్యక్రమాల్లో  పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలిస్తాయి. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. జాదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకూలతలున్నాయి. మీ కష్టం ఫలిస్తుంది. రుణ సమస్యలు తొలగిపోతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. బుధ, శనివారాల్లో అప్రమత్తంగా వుండాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పనివారల వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో వుంచుకోండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహమార్పు కలిసివస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. వ్యాపారాలు లాభసాటిదా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశాలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.