మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. ధనలాభం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. రైతులకు వాతావరణం అనుకూలిస్తుంది. వేడుకకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మీదైన రంగంలో రాణిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆచితూచి అడుగేయాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతాన సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
మిధునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
శుభవార్తలు వింటారు. యత్నాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సన్నిహితులు సహాయం అందిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులకు తరుణం కాదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు." శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. నోటీసులు అందుకుంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఆపన్నులకు సాయం అందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
శ్రమించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. దంపతుల మధ్య తరచు వివాదాలు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సోమ, మంగళ వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన అధికం. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. అయిన వారితో సంభాషిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగవు. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆహ్వానం అందుకుంటారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు చికాకులు అధికం. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలించదు.
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
గ్రహబలం బాగుంది. యత్నాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. శుక్రవారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆది, శని వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. విందులు, వేడుకకు హాజరవుతారు.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గ్రహం ప్రశాంతంగా ఉంటుంది. పత్రాల్లో మార్పుచేర్పులు సానుకూలమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధాల్లో ఏకాగ్రత వహించండి. సోమవారం నాడు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. గుట్టుగా యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెదురవుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శుక్రవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం తీరు అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పట్టించుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధి అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఈ వారం మీ ఓర్పునకు పరీక్షా సమయం. సామరస్యంగా మెలగండి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. కీలక పత్రాలు అందుతాయి. పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. అవివాహితులకు శుభయోగం. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి.