శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 15 జులై 2023 (18:13 IST)

16-07-2023 నుంచి 22-07-2023 వరకు మీ వార రాశిఫలాలు_కన్యారాశికి కష్టమే (video)

kanya rashi
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆదివారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
కీలక విషయాలపై పట్టుసాధిస్తారు. మీ సమర్ధతపై ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. సోమ, మంగళవారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితమిస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. ధనలాభం ఉన్నాయి. బుధవారం నాడు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సంతానానికి ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. జాతక పొంతన ప్రధానం. ప్రియతములు ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. నూతన వ్యాపారాలు కలసివస్తాయి. ఎరువుల వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణం తలపెడతారు.

 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
ఈ వారం అనుకూలదాయకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అయిన వారికి సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ప్రతికూలతలు తొలగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రాబడిపై దృష్టి సారిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం విదేశీ చదువులపై శ్రద్ధ వహిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పత్రాలలో సవరణలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. గృహ అలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల వ్యవహారంలో పునరాలోచన మంచిది. ఆప్తులకు వివాహ సమాచారం అందిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు శుభయోగం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 


కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఆదాయం అంతంత మాత్రమే. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. చిరువ్యాపారాలకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
మీ భావాలకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. వ్యవసాయ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. కూలీలు, వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటాటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. గురువారం నాడు పనులు అనుకున్న విధంగా సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో మెలగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. దళారులతో జాగ్రత్త. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగ్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ సంస్థలో మదుపు తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆత్మస్థైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పట్టించుకోవద్దు. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సమయానికి సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. సంతానం విషయంలో మేలు జరుగుతుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. నూతన వ్యాపారాలు కలసిరావు. న్యాయ, వైద్య రంగాల వారికి బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు వేగవంతమవుతాయి. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. బంధవుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. దుబారా ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆది, గురువారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.