గురువారం, 25 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 4 మే 2024 (16:08 IST)

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అపోహలు, అనుమానాలకు తావివ్వవద్దు. ప్రతిభకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోండి. అవసరానికి సాయం చేసేవారు ఉండరని గమనించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయుల హితవు మీపై సత్ ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ నిర్ణయాలను ఖచ్చితంగా తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారంలో గణనీయమైన పురోభవృద్ధి సాధిస్తారు. పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఈ పరిస్థితులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆది, సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వృత్తిపరమైన సమస్యలు తొలగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు, నూతన వ్యాపారాలు కలిసిరావు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. అతిగా ఆలోచింపవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గురువారం నాడు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులు కలయిక వీలుపడదు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. సంతానం విజయం ఉల్లాసాన్నిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పాత మిత్రుల కలయిక అనుభూతినిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం. ఉన్నతాధికారులకు స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యానుకూలత ఉంది. కొన్ని సమస్యలు తొలుగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మంగళవారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు కలిసివస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లాభదాయక ఫలితాలున్నాయి. శుభవార్తలు వింటారు. మీ కృషి, పట్టుదల స్ఫూర్తిదాయకమవుతాయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ధనలాభం ఉంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పన్ను చెల్లింపుల్లో అలసత్వం తగదు. బుధవారం నాడు అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాలను సాధిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పొదుపు చేయాలన్న ఆలోచనన ఫలించదు. బంధుత్వాలు బలపడతాయి. గురు, శుక్రవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. మనోధైర్యం పెంపొందుతుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. పొదుపునకు ఆస్కారం లేదు. శనివారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదివారం నాడు వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పాతమిత్రుల కలయిక అనుభూతినిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా శుభదాయకం. మనోభీష్టం నెరవేరుతుంది. పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. బుధ, గురువారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఏ పని చేపట్టినా విజయవంతమవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. శుక్రవారం నాడు నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహనిర్మాణాలు ముగింపునకు వస్తాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. బంధుత్రుల రాకపోకలు అధికమవుతాయి. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. శనివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. నోటీసులు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నూతన వ్యాపారాలు కలిసిరావు. షాపుల స్థలమార్పు అనివార్యం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం కలిసివచ్చే సమయం. కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సోదరీ సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నెరవేరుస్తారు. అధికారులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.