బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (16:11 IST)

28-04 - 2024 నుంచి 04-05-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astro
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. మంగళవారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. సౌమ్యంగా మెలగండి. ఏ విషయంలోనూ తొందరపాటు తగదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. భూ వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. నిర్దేశిత లక్ష్యాలతో యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, సోమవారాల్లో పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కొన్ని పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు శ్రమ, త్రిప్పట అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఖర్చులు అధికం. పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బుధవారం నాడు ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణలకు తరుణం కాదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా ప్రోత్సాహకరమే. లక్ష్యాన్ని సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో శ్రమిస్తే మంచి ఫలితాలుంటాయి. మీ సామర్ధ్యానికి గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ఆదాయ బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం పై చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, మధ్యవర్తులను నమ్మవద్దు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీదైన రంగంలో శుభపరిణామాలున్నాయి. మనోబలంతో యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆదివారం నాడు పనులు, కార్యక్రమాలు సాగవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలకు ధీటుగా స్పందిస్తారు. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం విషయంలో శుభపరిణామాలనున్నాయి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ఆత్యీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం. ఉన్నతాధికారులకు హోదామార్పు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. హోల్‌‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం అనుకూలదాయకమే. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దేశిత లక్ష్యాలతో యత్నాలు ప్రారంభిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సంతానం విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. కొత్త పరిచయాలేర్పడతాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల రాక ఉల్లాసాన్నిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా వదిలేయండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు శుభపరిణామాలున్నాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వాగ్ధాటితో రాణిస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆదివారం నాడు కొందరి రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు, పనులు సాగవు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం ఉల్లాసాన్నిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. మానసికంగా స్థిమిత పడతారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు వేగవంతమవుతాయి. బుధ, గురువారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వేడుకలు, దైవకార్యంలో పాల్గొంటారు.