Daily Horoscope
✕

2020 సంవత్సర ఫలితాలు- కుంభ రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

Written By రామన్
Updated: బుధవారం, 11 డిశెంబరు 2019 (14:52 IST)
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 6
 
ఈ రాశివారికి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. ఒత్తిడి, ఆందోళనలు అధికంగా వుంటాయి. శని హానికరం కాజాలడు. మూడు నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించండి ఉత్తమం. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు విపరీతం. పెట్టుబడులకు తరుణం కాదు. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. పట్టుదలతో యత్నాలు సాగించాలి.

సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. బంధువులతో పట్టింపులు ఎదుర్కొంటారు. ఆత్మీయుల ప్రమేయంతో సమస్యలు సద్దుమణుగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యంలో ఒడిదుడుకులు తప్పవు.

స్థలమార్పు కలిసివస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఏ పురోగతి ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. తరుచూ దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
ధనిష్ట నక్షత్రం వారు తెల్ల పగడం, శతభిషా నక్షత్రం వారికి గోమేధికం, పూర్వాభాద్ర నక్షత్రం వారికి వైక్రాంతమణి ధరించినట్లైతే శుభం కలుగుతుంది.

అన్నీ చూడండి

Amaravati: 2028-29 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యం

మంచినీళ్ల బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

భర్త, అత్తమామల వరకట్నం వేధింపులు.. ఉరేసుకుని ఆత్మహత్య

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - 3 దశల్లో పోలింగ్

స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన-తెదేపా మధ్య లుకలుకలు మొదలయ్యాయా?

అన్నీ చూడండి

14-10-2026.. బుధవారం మీ రాశి ఫలాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త..

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

13-10-2026 నాటి రాశి ఫలాలు - ధన సంబంధిత విషయాల్లో క్రమశిక్షణ అవసరం

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments