శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (18:27 IST)

కలబంద గుజ్జును రోజూ ఓ స్పూన్ తీసుకుంటే..?

కలబంద గుజ్జును రోజూ ఓ స్పూన్ తీసుకుంటే.. టైప్ -2 డయాబెటిస్ అదుపులో వుంటుంది. రోజూ రాత్రి పూట కలబంద గుజ్జును తీసుకుంటే అజీర్తి వుండదు. గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. క‌లబంద గుజ్జులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఆ గుజ్జును తింటే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
 
అలాగే వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే క‌ల‌బంద గుజ్జును తింటే జీర్ణాశ‌యంలో ఉండే సూక్ష్మ క్రిముల‌న్నీ న‌శిస్తాయి. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.
 
అలాగే సౌందర్యానికి కలబంద మేలు చేకూరుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలోనూ అలోవెరా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. కొద్దిగా గుజ్జును తీసుకుని ఆయా ప్ర‌దేశాల‌పై రాస్తే ఆ స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పాదాలు బాగా ప‌గిలిన వారు ఆ ప‌గుళ్ల‌పై క‌ల‌బంద గుజ్జును అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తే త్వ‌ర‌గా పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి. 
 
క‌ల‌బంద గుజ్జుకు కొన్ని నీళ్లు క‌లిపి దాన్ని మౌత్‌వాష్‌గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో దంత స‌మ‌స్య‌లు పోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు న‌శిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.