1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (11:15 IST)

ఉప్పునీటితో తరచూ స్నానం చేస్తే...

శారీరక శుభ్రత కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది. అయితే, ఈ స్నానం మంచినీటితో చేస్తారు. అదే ఉప్పునీటితో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా, స్నానం చేసే నీటిలో కాస్తంత ఉప్పు వేసుకున్నట్టయితే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
* ఉప్పు నీటితో స్నానం చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి. 
* కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
* ఉప్పు కలిపిన నీటితో సున్నితంగా శరీరాన్ని మర్దనా చేసుకుంటే రక్తప్రసరణ తీరు మెరుగవుతుంది. 
* ఉప్పులోని సహజ సిద్ధమైన ఖనిజాలు, పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. 
* చర్మంపై పగుళ్లు, మచ్చలు,నలుపుదనం తొలగిపోయి మంచి నిగారింపు వస్తుంది. 
* ఉప్పు నీటి వల్ల పాదాలు, చేతి వేళ్ల మధ్య మురికిదనం తొలగిపోతుంది. 
* టాక్సిన్లు, బ్యాక్టీరియా బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఉప్పు నీటితో స్నానం చేస్తుండాలి. 
* చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉండేలా ఉప్పులోని ఖనిజాలు దోహదపడతాయి. 
* చర్మం ముడతలు పడుతుంటే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారు ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
* చర్మంపై పుళ్లు, పొలుసులు, ఒరిసిపోవడం ఉంటే ఉప్పునీటితో కడిగితే సాంత్వన లభిస్తుంది. 
* చర్మ సంబంధమైన సమస్యలనే కాదు, ఆస్టియో ఆర్థరైటిస్, వాపులను కూడా నివారించేందుకు ఉప్పునీటితో స్నానం చేయడం మంచిది.