శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:09 IST)

గరిక ఆకులను పొడిచేసి తీసుకుంటే?

గరిక వేర్లను మెత్తగా నూరి అందులో కొద్దిగా పసుపు కలుపుకుని లేపనంగా వేసుకుంటే అలర్జీలు, దద్దుర్లు, దురదలు వంటి పలు చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. గరిక ఆకు రసాన్ని పూతగా వేస్తే గాయాల నుండి వచ్చే రక్తస్రావం ఆ

గరిక వేర్లను మెత్తగా నూరి అందులో కొద్దిగా పసుపు కలుపుకుని లేపనంగా వేసుకుంటే అలర్జీలు, దద్దుర్లు, దురదలు వంటి పలు చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. గరిక ఆకు రసాన్ని పూతగా వేస్తే గాయాల నుండి వచ్చే రక్తస్రావం ఆగుతుంది. మెత్తగా నూరిన గరిక గడ్డి ముద్దను స్పూన్ మోతాదులో ప్రతిరోజు రెండు పూటలా తీసుకుంటే అర్శమెులల నుండి వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.
 
గరిక ఆకులను ఎండబెట్టి పొడిచేసి స్పూన్ పొడిని అరకప్పు నీటిలో కలుపుకుని తీసుకోవడం వలన కడుపులోని అల్సర్ తొలగిపోతుంది. రెండు లీటర్ల గరిక ఆకుల రసాన్ని లీటరు కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెను రోజు తలకు మర్దన చేస్తే చుండ్రు సమస్యలు రావు. గరిక ఆకులను నూరి పచ్చడిగా చేసుకుని భోజనంతో తీసుకుంటే శరీర నొప్పులు తగ్గుతాయి. గరిక గడ్డి కషాయంతో నోటిని పుక్కిలిస్తే నోటి అల్సర్ తగ్గుతుంది.