సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (13:05 IST)

పల్లేరు కాయల చూర్ణాన్ని ఆవు పాలతో కలుపుకుని తీసుకుంటే?

పల్లేరు ఆకులను ఆముదంలో కాసేపు నానబెట్టి ఆ నూనెను చర్మానికి రాసుకుంటే చర్మంపై గల గడ్డలు తొలగిపోతాయి. పల్లేరు కాయలు, నువ్వు చెట్టు పువ్వులు, తేనె, నెయ్యి ఇవన్నీ సమభాగాలుగా తీసుకుని మెత్తని పేస్ట్‌లా తయా

పల్లేరు ఆకులను ఆముదంలో కాసేపు నానబెట్టి ఆ నూనెను చర్మానికి రాసుకుంటే చర్మంపై గల గడ్డలు తొలగిపోతాయి. పల్లేరు కాయలు, నువ్వు చెట్టు పువ్వులు, తేనె, నెయ్యి ఇవన్నీ సమభాగాలుగా తీసుకుని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే జుట్టు రాలవడం తగ్గుతుంది.
 
పల్లేరు కాయలను, శొంఠిని దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో వేసుకుని బాగా మరిగించుకుని వడగట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఈ చూర్ణాన్ని ఆవుపాలలో కలుపుకుని తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతుంది. పల్లేరు కాయల చూర్ణాన్ని పావు లీటర్ పాలలో వేసి 1 లీటర్ నీళ్లలో కలుపుకుని కాచి వడగట్టి అందులో చక్కెర కలుపుకుని తీసుకుంటే మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.