గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: మంగళవారం, 1 ఆగస్టు 2017 (18:55 IST)

కరక్కాయతో స్థూలకాయానికి చెక్... సింపుల్‌గా ఏం చేయాలంటే?

ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కటి వైద్యశాల వంటిది మన వంటగది. అదెలాగంటే... ఇక్కడే అన్ని దినుసులు వుంటాయి. కొన్నింటిని మనం బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుని వాడుకుంటుంటాం. ఇకపోతే ఇప్పుడు కరక్కాయ వల్ల కలిగే ఫలితాలేమిటో చూద్దాం. * ఒకటి రెండు చెంచాల కరక్కా

ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కటి వైద్యశాల వంటిది మన వంటగది. అదెలాగంటే... ఇక్కడే అన్ని దినుసులు వుంటాయి. కొన్నింటిని మనం బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుని వాడుకుంటుంటాం. ఇకపోతే ఇప్పుడు కరక్కాయ వల్ల కలిగే ఫలితాలేమిటో చూద్దాం.
 
* ఒకటి రెండు చెంచాల కరక్కాయ పొడిని భోజానికి ముందు మజ్జిగతో సేవిస్తే స్థూలకాయం తగ్గిపోతుంది. 
 
* పసుపుకొమ్ము రసాన్ని ఇనుప పాత్రలో వుంచి వేడి చేస్తూ, కరక్కాయ కల్కాన్ని చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం లేపనంగా వేస్తే గోరుచుట్టు వాపు తగ్గుతుంది. 
 
* కరక్కాయ ఒక భాగం, వేయించిన పిప్పళి చూర్ణం సగభాగం రెండూ కలిపేయాలి. దీనిలో నుంచి ఒక గ్రాము చూర్ణాన్ని తేనెతో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి చెప్పున సేవిస్తుంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది.
 
* కరక్కాయ చూర్ణాన్ని తేనెతో సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి.
 
* కాస్తంత కరక్కాయ చూర్ణాన్ని, 3 గ్రాముల తేనెతో రోజూ రెండు పూటలా సేవిస్తూ, ఉప్పు, కారం, మసాలాలు లేని చప్పిడి ఆహారం తీసుకుంటచుంటే పచ్చ కామెర్లు తగ్గిపోతాయి. 
 
* కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తే రక్త మొలలు హరిస్తాయి.