మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (13:24 IST)

తేగల పిండితో రొట్టెల్లా చేసుకుని తింటే.?

తేగలు తినడం వల్ల బరువు తగ్గుతారు. తేగలను ఉడికించి చిన్నముక్కలుగా చేసి మెత్తగా చేసి కొబ్బరిపాలు, బెల్లం, యాలకుల పొడి కలిపి తింటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. తేగల పిండితో రొట్టెల్లా చేసుకుని తినొచ్చు. ఇలా చేస్తే ఒబిసిటీ మాయమవుతుంది. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు ఉండడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోరు. అలా బరువు తగ్గుతారు. 
 
తేగల్లో పీచు, కాల్షియం, ఫాస్ఫరస్‌, ధాతువులు, ఒమేగా-3 పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో పొటాషియం, బి, బి1, బి3, సి కూడా ఉన్నాయి. తేగలను పాలల్లో ఉడికించి ఆ పాలను చర్మానికి రాసుకుంటే మృదువుగా మారుతుంది. తేగలు వేసవిలో చెమటకాయలను తగ్గిస్తాయి. 
 
తేగలు సహజసిద్ధమైన నోటి ఫ్రెష్‌నర్స్‌‌గా పనిచేస్తుంది. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.