గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:18 IST)

వర్షాకాలం మిరియాల్ని వంటకాల్లో ఎందుకు చేర్చాలి? చెమట వాసనకు చెక్ పెట్టాలంటే?

వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్ల

వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలావరకు నియంత్రించుకోవచ్చు. 
 
వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. ఆహార పదార్థాల్లో మిరియాల పొడిని చేర్చడం ద్వారా చెమట దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి. దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది. వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.