ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (12:51 IST)

మజ్జిగను పరగడుపున తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ పరార్

butter-milk
ఉదయం పూట మజ్జిగను మాత్రం తాగితే.. చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజూ మజ్జిగను తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ సరైన జీవన విధానంతో ఏర్పడుతుంది. 
 
ఈ చెడు కొలెస్ట్రాల్ ద్వారా పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టాలంటే.. మజ్జిగను తప్పకుండా తీసుకోవాలి. మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట పరగడుపున మజ్జిగ తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ దూరమవుతుంది. 
 
ఇది శరీర వేడిమిని తగ్గిస్తుంది. మజ్జిగలో అల్లం, మిరియాల పొడి, జీలకర్ర చేర్చి తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగ ఎముకలకు బలాన్నిస్తుంది. పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. 
 
మహిళలకు నెలసరి కాలంలో ఏర్పడే సమస్యలను దూరం చేస్తుంది. ఇందులోని ధాతువులు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మజ్జిగలో విటమిన్ సి, బి వుండటం చేత జుట్టు రాలడం తగ్గుతుంది. ప్రోబయోటిక్ లాక్టిక్ ఆమ్లం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.