శుక్రవారం, 25 జులై 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (15:22 IST)

వృద్ధాప్య ఛాయలకు క్యారెట్, టమోటా జ్యూస్‌తో చెక్!

వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా? గ్లోయింగ్ స్కిన్ కావాలా అయితే రోజూ ఓ గ్లాసు క్యారెట్, టమోటా జ్యూస్ తీసుకోండి. ఎందుకంటే ఈ క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్‌ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. యంగ్‌గా ఉంచుతుంది. 
 
అలాగే టమోటా జ్యూస్ కూడా చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. టమోటో జ్యూస్ మన శరీరానికి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్‌ను వేరు చేసే మూలకం పొటాషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు లైకోపిన్ అనే లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీక్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి కాంతినిస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.