శుక్రవారం, 25 జులై 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (17:18 IST)

ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికెళ్తున్నారా?

ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. ఏ పని చేయాలన్నా తిన్న తర్వాతే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే ఆహారం ఏమిటంటే... 
 
గుప్పెడు బాదం పలుకులు నానబెట్టినవి కానీ, పచ్చివి కానీ తీసుకొంటే తక్షణ శక్తి అందుతుంది. దాన్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. మనసు కూడా బాగాలేదా? అయితే ఓ చిన్న డార్క్ చాక్లెట్‌ని చప్పరించి చూడండి. 
 
చిన్నచిన్న చికాకులు ఉంటే తొలగిపోతాయి. తక్షణం మరో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. బ్యాగులో గుప్పెడు గుమ్మడి విత్తనాలు వేసుకొని చూడండి. ఇవి తినడం వల్ల ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.