1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2016 (13:39 IST)

నాజుగ్గా.. గ్లామర్‌గా ఉండాలంటే.. వారానికి రెండు సార్లు చేపలు తినండి..!

చేపలు తినాలంటేనే.. అమ్మాయిలు వద్దు వద్దు అంటుంటారు. స్టైల్ పేరిట ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని పక్కనబెట్టేస్తున్నారు. ఏదో లైట్ లైట్‌గా తీసుకుని పనికానిచ్చేస్తారు. అయితే అమ్మాయిలు నాజూగ్గా.. గ్లామర్‌

చేపలు తినాలంటేనే.. అమ్మాయిలు వద్దు వద్దు అంటుంటారు. స్టైల్ పేరిట ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని పక్కనబెట్టేస్తున్నారు. ఏదో లైట్ లైట్‌గా తీసుకుని పనికానిచ్చేస్తారు. అయితే అమ్మాయిలు నాజూగ్గా.. గ్లామర్‌గా ఉండాలంటే.. కడుపు మాడ్చుకోవడం కంటే.. వారానికి రెండుసార్లు చేపల వంటకాలను డైట్‌ చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
చేపల్ని వారానికి ఓసారై వంటల్లో చేర్చుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థమైన కొవ్వు తగ్గిపోతుందని.. తద్వారా మెరిసే మేనిఛాయతో పాటు బరువు తగ్గుతారు. నాజూగ్గా తయారవుతారు. ఇంకా చేపల్ని తీసుకుంటే యువతీయువకుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. చర్మం నిగారింపును సంతరించుకోగా, వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి. 
 
ఇంకా చేపల్ని తీసుకోవడం ద్వారా కంటి చూపు చాలా బాగుంటుంది. దీంతోపాటు గుండె సంబంధిత జబ్బులను 36 శాతం మేరకు తగ్గుతుంది. చేపలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.