మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (10:49 IST)

మహిళల్లో వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే పెరుగు..

ఒత్తిడిగా వున్నట్లు అనిపించినప్పుడు కాస్త పెరుగు తీసుకుంటే చాలు.. మెదడు తేలికగా మారుతుంది. ఇంకా క్రమం తప్పకుండా పెరుగును తీసుకుంటే ఒబిసిటీ దరి చేరదు. బరువు నియంత్రణలో వుంటుంది. పెరుగు తీసుకునేవారిలో  గుండె సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. పెరుగు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే అందుకు కారణం. అధికరక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.
 
అంతేగాకుండా శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరుగులో వుంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని వైద్యులు చెప్తున్నారు. దీనిలో క్యాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, పళ్లు దృఢంగా ఉండేలా చేస్తుంది.
 
భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపోరోసిస్‌ లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి.  దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపులో ఇన్‌ఫెక్షన్లు కూడా అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.