శుక్రవారం, 25 జులై 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : గురువారం, 13 నవంబరు 2014 (17:21 IST)

హైప్రోటీన్లు కూడా బరువు తగ్గిస్తాయట!

కోడిగుడ్లు, మాంసం, చేపలు వంటి హై ఫుడ్ ప్రోటీన్లను మితంగా తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తక్కువ క్యాలెరీలు గల ఆహారం కంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంపై దృష్టి సారించడం మంచిదని పరిశోధకులు అంటున్నారు. 
 
సాధారణంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఖర్చయ్యే క్యాలరీల పైన దృష్టి పెడతారు. కానీ తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. ఒకవేళ తక్కువ ప్రోటీన్ గల ఆహారం తీసుకుంటే, ప్రోటీన్ లెవల్స్‌ను చేరడానికి అదనంగా ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవాల్సి వస్తుంది. 
 
అది అంతిమంగా అధిక బరువుకు దారితీస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్ ఫుడ్‌పై దృష్టి పెట్టడం మంచిదని పరిశోధకులు అంటున్నారు.