గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శనివారం, 13 మే 2017 (17:11 IST)

మహిళలు కొబ్బరినూనె వాడితే.. పొట్టచుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుందట..

కొబ్బరినూనెతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరినూనెలోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరినూనెను మహిళలు వంటల్లో

కొబ్బరినూనెతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరినూనెలోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరినూనెను మహిళలు వంటల్లో వాడటం వాటిని స్వీకరించడం ద్వారా స్త్రీల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. కొబ్బరినూనె వాడకం వల్ల థైరాయిడ్, ఇతర ఎండోక్రైన్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి. 
 
శరీర మెటబాలిక్ రేటును కొబ్బరినూనె పెంచడం ద్వారా శరీర బరువు అదుపులో ఉంటుంది. కిడ్నీలో ఏర్పడే రాళ్లను కొబ్బరినూనె కరిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచి.. వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు గురికాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరినూనెలోని లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ ద్వారా రక్తపోటు ద్వారా గుండెకు హాని కలగకుండా రక్షణ కల్పిస్తుంది. ఇందులోని ఫ్యాటీ ఆమ్లాలు అధిక బరువును తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.