బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (19:10 IST)

గర్భిణీ స్త్రీలు తినవలసిన ఆహరం ఏమిటి?

గర్భిణీ స్త్రీలు తినవలసిన ఆహారం ఏమిటంటే, పోషకాహారం అన్నీ తినవచ్చు, డ్రై ఫ్రూట్స్, పళ్ళు, కూరగాయలు. కొంతమందికి వాంతులు అయినా కూడా తినాలి అనిపించకపోయినా తప్పనిసరిగా తినాలి, ఎందుకంటే ఎదుగుదల ముఖ్యం కాబట్టి.

కానీ పచ్చళ్ళు లాంటివి తినకూడదు, ఎందుకంటే బీపీ పెరిగితే రేపు పురిటికి కష్టమవుతుంది, కానీ రోటి పచ్చడి అయితే తినవచ్చు కారం కొంచెం ఉప్పు కొంచెం తక్కువ చేసి తినవచ్చు ఉన్న గర్భిణీ స్త్రీ అయితే ఇందులో కొన్ని పళ్ళు, తినకూడదు. కాళ్ళకి నీరు పట్టే వాళ్ళు బార్లీ గింజలు ఉడకబెట్టుకుని పొద్దున్నే తాగాలి, మామూలుగా ఉన్నప్పుడు కంటే గర్భిణీగా ఉన్న స్త్రీ ఎక్కువ పాలను తీసుకోవాలి.
 
పళ్ళు
1. దానిమ్మ. 2. ద్రాక్ష. 3. సపోటా. 4. యాపిల్ రెండు రంగులు తినవచ్చు 5. నల్ల ద్రాక్ష. 5. నారింజ. 6. సీతాఫలం. 7. కివి ఫ్రూట్ 8. పనసకాయ. 9. జామ పండు. 10. పుచ్చకాయ. 11. పంపరపనస. 12. మామిడి పండు. 13. అరటిపండు 14. కమలా పండు. 15. కీరా దోసకాయ. 16. బత్తాయి.
 
కూరగాయలు
దోసకాయ,  బీరకాయ,  పొట్లకాయ,  దొండకాయ, బెండకాయ, కాకరకాయ, వంకాయ్ చాలా రకాలు ఉన్నాయి అన్నీ తినొచ్చు. మునక్కాయ, క్యాప్సికం చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్ క్యాప్సికం తినొచ్చు. ఆనపకాయ, గుమ్మడి కయ అయితే తినకూడదట. ముల్లంగి, టమాటా, చిక్కుడు కాయలు రెండు రకాలు చిక్కుడుకాయలు తినవచ్చు.  ఉల్లిపాయలు తినవచ్చు, ఉల్లికాడలు కూడా తినవచ్చు. క్యారెట్, బీట్ రూటు ఈ రెండు చాలా ఎక్కువగా తినాలి ఎందుకంటే దీనివల్ల రక్తం పెంపొందించి పురిటి టైంలో చాలా అవసరం పడుతుంది. పనసపొట్టు.
 
ఆకుకూరలు
1. తోటకూర 2 . పాలకూర. 3. గోంగూర.4. కరివేపాకు. 5. కొత్తిమీర.6. పొదీనా. 7. బచ్చలి కూర. 8. చుక్కకూర. 9. మునగాకు.

డ్రై ఫ్రూట్స్
1. జీడిపప్పు. 2. బాదంపప్పు నానబెట్టుకుని తర్వాత పొద్దున్నే తొక్క కొలుచుకుని తింటే పుట్టే బిడ్డకు బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది. 3. పిస్తా. 4. అక్రూట్ తింటే తల్లికీ బిడ్డకీ కూడా గుండె పదిలంగా ఉంటుంది. 5. అంజీర. 5. కిస్ మిస్. 6. ఖర్జూరం. 7. ఎండు ఖర్జూరం రాత్రి నానబెట్టుకుని పొద్దునే ఆ నీళ్లు తాగితే ఎండా ఆ ఈ సమయంలో తల్లికి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది.