గురువారం, 30 నవంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 సెప్టెంబరు 2021 (21:43 IST)

బెల్లీ ఫ్యాట్ తగ్గించి అధికబరువును కంట్రోల్ చేసే ఆహారం

బాదంలో అధిక క్యాలరీలు కలిగి ఉండి బెల్లీ ఫ్యాట్ వద్ద కొవ్వు పెరగడానికి దోహదం చేయదు. అలాగే ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది అలాగే ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులోని ప్రోటీనులు మీ ఆకలిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది మరియు ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
 
గ్రీన్ టీ లో పోలిఫెనోల్స్ మరియు కాటెచిన్స్ వంటి కొన్ని రసాయనాలు జీవక్రియను పెంచడానికి మరియు కొవ్వును కరిగించటానికి సహాయం చేస్తాయి. మీరు ప్రతిరోజు 2 కప్పుల గ్రీన్ టీని తీసుకోవాలి. నడుమభాగం తగ్గించేందుకు సహాయం, అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
 
పుట్టగొడుగులు తీసుకుంటే మనం రోజంతా స్నాక్స్ తీసుకోకుండా సహాయపడుతుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ప్రతి రోజూ మీ దినచర్యను ప్రారంభించడానికి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ ఆహారం. ఓట్స్ మీ పొట్టనింపడం మాత్రమే కాదు, ఆ రోజుకు సరిపడే శక్తిని నిదానంగా విడుదల చేస్తూపోతుంది. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి మరియు మీలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.