బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 సెప్టెంబరు 2021 (21:35 IST)

అధిక బరువు వల్ల వచ్చే సమస్యలు ఏమిటో తెలుసా?

అధిక బరువు వల్ల వచ్చే సమస్యలు, వ్యాధులు అంతే పెద్ద సమస్యగా మారుతాయంటున్నారు వైద్యులు. అధిక బరువుతో ఉండేవారికి....
 
1. మధుమేహం రావచ్చు
2. అధిక రక్తపోటు కంపల్సరీ కావచ్చు
3. గుండె సంబంధిత వ్యాధులు వెతుక్కుంటూ వస్తాయి
4. అధిక కొవ్వుతో ఇతర సమస్యలు
5. క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుందని చెప్పవచ్చు
6. పురుషుల్లో అయితే అంగ స్తంభన సమస్య
7. స్త్రీలలో అయితే గర్భదారణ సమస్యలు, ఇన్ఫెర్టిలిటీ... ప్రెగ్నెన్సీ వచ్చినా అనేక సమస్యలు
 
పై సమస్యలన్నిటీ ఒక కారణంగా అధిక బరువును చెప్పవచ్చు. దీన్ని నియంత్రించుకోనట్లయితే అనారోగ్యానికి దగ్గరవుతున్నట్లే లెక్క. ఏదో నీడపట్టున ఉద్యోగం చేస్తున్నాములే అనుకుంటే పొరబాటే. ఎండలో శరీరం అలసిపోయేట్లు చేసిన చాకిరి వల్లనే గ్రామీణులు 90 ఏళ్లకు పైగా ఆయుర్దాయంతో చాలా గట్టిగా బతికేస్తుంటారు.
 
కానీ నగరాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. కొంతమంది మాత్రమే వర్కవుట్లు చేస్తూ శరీరాన్ని కండిషన్లో ఉంచుకుంటారు. మిగిలినవారు మాత్రం... తిన్నామా... పడుకున్నామా... తెల్లారిందా... అనే సూత్రంతో రోజు గడిపేస్తున్నారు. దీని ఫలితమే నేడు నగరాల్లో నాలుగింట ముగ్గురు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.