శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (22:48 IST)

బరువు తగ్గాలా..? మందారం టీని తాగేయండి..

Hibiscus Tea
మందారంలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇది  బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. అందుకే మందారం టీని తాగాలి. మందారం డికాషన్ తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య తగ్గుతుంది. కనుక హైబీపీతో బాధపడే వాళ్ళు బీపీ తగ్గించుకోవడానికి మందారం ఉపయోగిస్తే చక్కటి బెనిఫిట్ పొందొచ్చు. 
 
హృదయ ఆరోగ్యానికి మందారం ఎంతో మేలు చేస్తుంది. గుండెల్లో ఇంఫ్లేమేషన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గిస్తుంది. అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలని మందారం ఇలా తరిమికొడుతుంది.
 
చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా చర్మాన్ని సాఫ్ట్‌గా ఉంచుతుంది. ఒబిసిటీను తగ్గించడంలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా బరువు కూడా తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
 
మందార ఆకులు, మందార రేకులు కూడా నేచురల్ కండీషనర్ లాగా పనిచేస్తాయి. అదేవిధంగా జుట్టుని మరింత నల్లగా మారుస్తుంది. చుండ్రు సమస్యని కూడా తగ్గిస్తుంది. మందారాన్ని ఉపయోగించడం వల్ల స్కిన్ కేన్సర్ సమస్య కూడా తగ్గుతుంది. ఇలా మందారంతో ఎన్నో లాభాలని మనం పొందొచ్చు.