గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 28 ఆగస్టు 2021 (20:29 IST)

రోజుకి 8 గ్లాసులు మంచినీరు తాగేవారి ఆరోగ్యం ఎలా వుంటుందో తెలుసా?

మీ జీవితాంతం రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగడం వలన 25 సంవత్సరాల తరువాత గుండె వైఫల్యం ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజా పరిశోధనలో తేలింది. 
 
ఐరోపా సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ 2021లో ఆగస్టు 24న సమర్పించిన పరిశోధనలు, మంచి హైడ్రేషన్‌ను నిర్వహించడం వల్ల గుండె వైఫల్యానికి దారితీసే పరిస్థితులను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
 
మనం ప్రతిరోజూ ఎన్ని గ్లాసుల మంచినీటిని తాగుతున్నామన్న దానిపై శ్రద్ధ వహించాలని, మనం చాలా తక్కువ తాగుతున్నట్లు అనిపిస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కనుగొన్నట్లు డాక్టర్ డిమిత్రివా చెప్పారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ ప్రకారం, పురుషులకు సిఫార్సు చేయబడిన మంచినీరు పురుషులకు 3.7 లీటర్లు, మహిళలకు 2.7 లీటర్లు.
 
ఇందులో అన్ని పానీయాలు (నీరు మాత్రమే కాదు) ఆహారం కూడా ఉంటుంది. ద్రవరూపం 20 శాతం ఆహారం నుండి వస్తుంది.