మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (19:19 IST)

పెరుగుతో పాటు సోంపు పొడిని కలిపి తీసుకుంటే?

పెరుగుతో పాటు సోంపు పొడి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. సోంపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంని పెంచుతుంది. కొవ్వుని కూడా ఇది కరిగించడంలో సహాయ పడుతుంది. కాబట్టి పెరుగు తో పాటు మెంతులు పొడి తీసుకుంటే బరువు తగ్గడానికి వీలవుతుంది.
 
అదే పెరు లో పసుపు వేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. బీపీ, ఫైల్స్, డైజషన్ కి పెరుగు సహాయ పడుతుంది. పెరుగులో కూలింగ్ ఎఫెక్ట్స్ తో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అజీర్తిని పోగొడుతుంది. 
 
రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాలలో తేలింది. పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలోని బి మరియు టి వంటి తెల్ల రక్తకణాలను పెరిగేలా చేస్తుంది. 
 
పెరుగు శరీరానికి కావల్సిన విటమిన్ కె అందిస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.