గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (19:17 IST)

పనసతో ఒబిసిటీ పరార్.. ఎలాగంటే?

పనసలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీని కారణంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అదేవిధంగా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పండిన పనస తినడం వల్ల ఒబిసిటీ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. పనసలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణమవడానికి బాగా ఉపయోగ పడుతుంది. దీంతో కడుపు మొత్తం క్లీన్‌గా ఉంటుంది. నీళ్లల్లో పనసని మరిగించి కూడా తీసుకోవచ్చు. 
 
పనసలో పొటాషియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్లో ఉంచుతుంది. దీనితో హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ఇందులోని పొటాషియం, క్యాల్షియం, రైబోఫ్లేవిన్, ఐరన్, జింక్ కూడా పనసలో ఉన్నాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తుంది.
 
శరీరంలోని రోగ నిరోధరక శక్తిని పెంచుతుంది. శరీరంలోని అనేక రుగ్మతల బారినుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఇది ప్రేగు మరియు లంగ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడి డి.ఎన్.ఎను డ్యామేజీ బారి నుండి కాపాడుతుంది. ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండె పోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది. 
 
పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఈ పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. 
 
రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది. పనసపండు చర్మ కాంతిని పెంచుతుంది. చర్మంపై మృత కణాలు తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.