బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 21 జూన్ 2021 (23:03 IST)

అలొవెరాతో అధికబరువుకి అడ్డుకట్ట, ఎలా?

ఒక చెంచా కలబంద రసాన్ని, ఒక చెంచా అల్లం రసాన్ని, ఒక కప్పు వేడి నీటిలో కలిపి తక్కువ మంట వద్ద వేడి చేయాలి. ఇలా తయారుచేసిన  మిశ్రమం బరువును తగ్గించటంలో అద్భుతంగా పని చేస్తుంది. ఈ మిశ్రమం త్రాగటం వలన జీర్ణకోశవ్యాధులను నివారించవచ్చు.
 
అధిక బరువుతో బాధపడే వారు కలబంద రసాన్ని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకొంటే శరీర అవయవాల చుట్టు ఉండే కొవ్వును కలబందలో ఉండే పైటోస్టెరోల్స్ కొవ్వును పూర్తిగా తగ్గించి వేస్తాయి.
 
అంతేకాదు జుట్టు రాలడం చిట్లడం వలన జుట్టు పెరగడం ఆగి పోతుంది. అందువలన కలబంద పేస్టును 15 రోజులకు ఒకసారి తలకు పెట్టుకోవడం వలన ఈ సమస్యను అరికట్టవచ్చు.
 
ముఖం మీద మొటిమల సమస్యతో బాధపడేవారు కలబంద గుజ్జును మొటిమలపై రాసి 20 నిముషముల తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.