శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (14:33 IST)

భోపాల్ విషాదానికి 35 ఏళ్లు, ఫోటోలు చెప్పే విషాద చరిత

శ్వాసకోశ సమస్యలతో షకీర్ అలీ ఖాన్ ఆస్పత్రిలో ఎక్స్-రే తీయించుకుంటున్న ఈ వ్యక్తి యౌవనంలో విషవాయువు ప్రభావానికి గురయ్యారు.
యూనియన్ కార్బయిడ్ రసాయనాల కర్మాగారం నుంచి వ్యాపించిన టన్నుల కొద్ది విష వాయువులకు భోపాల్ నగరంలోని ప్రజలు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషాద చరిత్రకు నేటితో 35 ఏళ్ళు, విషవాయువులు విడుదలైన 24 గంటల్లోనే 3 వేల మందికి పైగా చనిపోయారని అంచనా. ఆ తరువాత మరి కొన్ని వేల మంది ఆ విషపు గాలులకు, అనంతర పరిణామాలకు బలయ్యారు. అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక విధ్వంసం.
రసాయన కర్మాగారం గోడ పక్కనే ఉండే బ్లూమూన్ ప్రాంతవాసి. ఈ ప్రాంతంలో 1984లో 5,50,000 మంది... అంటే భోపాల్ జనాభాలో మూడింట రెండు వంతులు ఉండేవారు.
బతికి ఉన్న వాళ్ళలో కూడా వేలాది మంది ఆ ప్రభావానికి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు లోనయ్యారు. జీవితాంతం వెంటాడే వైకల్యాలను భరించారు. ఆ రసాయన కర్మాగారం అవశేషాల చీకటి నీడల్లో చితికిపోయిన జీవితాలను ఫోటోగ్రాఫర్ జుడా పాసోవ్ తన కెమేరాలో బంధించారు.
 
ఇవీ చరిత్ర మరువని విషాదానికి చెరగని సాక్ష్యాలు.
 
ప్రాచీ చుగ్‌కు మెదడు పెరగని వ్యాధి వచ్చింది. అది ఆమె తల్లి భోపాల్‌లో ఆ రాత్రి విషవాయులు పీల్చిన ఫలితం.