శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (16:13 IST)

ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు సెమీస్‌లో చోటు ఖాయం... ఓడితే ఏమవుతుంది?

ఇప్పటివరకూ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఐదింటిలో గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు కాగా, మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉంది.
 
బంగ్లాతో మ్యాచ్‌లో ఓడినా, భారత్‌కు సెమీస్ అవకాశాలుంటాయి. ఈ నెల 6న శ్రీలంక‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, నాకౌట్స్ చేరుకోవచ్చు. ఒక వేళ అది కూడా ఓడినా, నెట్ రన్ రేట్‌ను మెరుగ్గా కొనసాగించుకుంటే, భారత్ సెమీస్‌కు అర్హత సాధించవచ్చు.
 
మరో వైపు బంగ్లా‌దేశ్‌కు ఇది చావో రేవో మ్యాచ్. 11 పాయింట్లతో టేబుల్‌లో ఆ జట్టు ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌తో పాటు పాకిస్తాన్‌తో ఓ మ్యాచ్‌ను ఆ జట్టు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిచినా, ఆ జట్టు సెమీస్ అవకాశాలు మిగతా జట్ల ఫలితాలపైనే ఆధారపడి ఉంటాయి.
 
భారత జట్టులో గాయపడ్డ విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ చేరాడు. గత మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు అవకాశం దక్కింది. నేటి మ్యాచ్‌‌లో ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. తుది-11 ఎవరనేది తెలియాల్సి ఉంది.