నేరేడు పండ్ల గుజ్జుతో ముఖ సౌందర్యం, ఎలాగంటే?
నేరేడు పండ్లు సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఈ పండ్లు లభిస్తున్నాయి. ఇవి తింటుంటే ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు కలుగుతుంది. చర్మ సౌందర్యానికి నేరేడు పండ్లు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము.
మెరిసే చర్మం కోసం నేరేడు గింజల పొడిని అప్లై చేయవచ్చు.
నేరేడు గింజల పొడిని శెనగపిండి, పాలతో కలిపి కూడా పూయవచ్చు.
ఉసిరి రసం, రోజ్ వాటర్‌లో నేరేడు గుజ్జును కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి.
నేరేడు గుజ్జును నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు.
నేరేడులో 85 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
నేరేడు తినడం వల్ల చర్మం పొడిబారదు, నిర్జీవంగా మారదు.
వీటిలో మీ చర్మానికి మేలు చేసే విటమిన్ ఎ, విటమిన్ సిలను తగినంత మొత్తంలో కలిగి ఉంటుంది.