శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : బుధవారం, 5 జులై 2017 (12:38 IST)

అలోవెరాతో అందం పొందండి ఇలా...?

ముఖంపై ఉన్న మచ్చలను తొలగించుకోవాలంటే.. అలోవెరా ఉపయోగించాల్సిందే. ముఖంపై మచ్చలు, పొడి చర్మం, ఇతరత్రా చర్మ సమస్యలున్నవారు రోజూ అలొవేరా జ్యూస్‌ను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పురుషులు షేవింగ్ చేసుకున్న

ముఖంపై ఉన్న మచ్చలను తొలగించుకోవాలంటే.. అలోవెరా ఉపయోగించాల్సిందే. ముఖంపై మచ్చలు, పొడి చర్మం, ఇతరత్రా చర్మ సమస్యలున్నవారు రోజూ అలొవేరా జ్యూస్‌ను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పురుషులు షేవింగ్ చేసుకున్న తర్వాత బ్లేడుతో గాయమైతే.. వెంటనే అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుంటే సరిపోతుంది.
 
అలోవెరా జ్యూస్‌ను రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే.. చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అలోవెరాను శుభ్రంగా కడిగి.. తొక్కతో పాటు మిక్సీలో రుబ్బుకుని పేస్టులా ముఖానికి, చేతులు, కాళ్లు, మెడకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మం మిలమిల మెరిసిపోతుంది. చర్మ వ్యాధులు నయమవుతాయి. తలకు పట్టిస్తే వేడి తగ్గుతుంది. 
 
అలోవెరా ముఖంపై గల ముడతలకు చెక్ పెడుతుంది. అలోవెరా జ్యూస్‌ను జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు. అలోవెరా జెల్, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకుని కేశాలకు పట్టిస్తే.. కురులు మెరిసిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.