మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (12:15 IST)

కార్తీక మాసం ముగింపు.. కోడిగుడ్ల ధరలు.. ఆల్ టైమ్ రికార్డ్

half-boiled eggs
కార్తీక మాసం ముగియడంతో కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం విశాఖ హోల్‌సేల్ మార్కెట్‌లో వంద కోడి గుడ్లు ధర రూ. 580. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584ని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది. 
 
ఈ రేటు ఆల్ టైమ్ రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు. చిల్లర మార్కెట్‌లో ఒక్కో గుడ్డును వ్యాపారులు రూ.6-50, రూ.7కు విక్రయిస్తుండగా.. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే రేటు ఉంది.  కార్తీక మాసంలో కోడిగుడ్లు, చికెన్, మటన్, చేపల ధరలు తగ్గుముఖం పట్టాయి. 
 
ఎందుకంటే ఆ మాసంలో చాలామంది గుడ్లు, మాంసం తినరు. ఈ నేపథ్యంలో ధరలు బాగా తగ్గాయి. కొనుగోలుదారుల సంఖ్య తగ్గడంతో దుకాణాలు వెలవెలబోయాయి. ప్రస్తుతం కార్తీక మాసం ముగియడంతో కొనుగోలుదారులు పెరగడంతో చికెన్, మటన్, చేపల ధరలు కాస్త పెరిగాయి. ముఖ్యంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి.